కరివేపాకుని అస్సలు తీసిపారేయొద్దు

కరివేపాకు కూరలో కనిపిస్తే చాలామంది ఏరి పారేస్తుంటారు. అయితే ఈ ఆకుల వల్ల వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం పచ్చి ఆకులే నమిలేస్తారు. దీనిలో శరీరానికి కావాల్సిన క్యాల్షియం, పాస్ఫరస్‌‌, ఐరన్‌‌, యాంటీ ఆక్సిడెంట్స్​ , విటమిన్‌‌–బి, కెరోటీన్‌‌ పుష్కలంగా ఉంటాయి.. అంతే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తాయి ఈ ఆకులు.

ఇవే కాదు ఇంకా చాలా లాభాలున్నాయి వీటితో.. కరివేపాకును ఖాళీ కడుపుతో నమిలితే  ఒబెసిటీ నుంచి బయటపడొచ్చు. హెయిర్​ ఫాల్ సమస్య తగ్గడంతో పాటు జుట్టు వేగంగా పెరుగుతుంది. ఉదయం పూట లేవగానే కొన్ని కరివేపాకు ఆకులు నమలడం వల్ల జీర్ణక్రియ కూడా  బాగుంటుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందొచ్చు.

Latest Updates