ముక్కు కారుతోందా?.. అయితే లైట్ తీస్కోకండి

జలుబును చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు. సీజనల్ మార్పుల వల్ల వచ్చిందేమో అనుకుంటారు. కానీ తీవ్ర జలుబు కారణంగా అలర్జీ వచ్చే ప్రమాదం ఉందని గ్రహించరు. పదే పదే ముక్కు కారుతున్నట్లయితే అశ్రద్ధగా ఉండకండి. కొందరికైతే తమకు అలర్జీ వచ్చినట్లు కూడా తెలియదు. అదేపనిగా ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, కళ్లలో నుంచి నీళ్లు కారడం, ముక్కు దగ్గర దురదగా అనిపించడం లాంటివి అలర్జీకి సంకేతాలుగా చెప్పొచ్చు. వీటిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే అలర్జీలు పెరగొచ్చు. అలర్జీ వచ్చినా వాటి సంకేతాలను ముందే తెలుసుకోవచ్చు. దుమ్ము లాంటి వాటితో ప్రమాదం ఏర్పడిందని ఇమ్యూన్ సిస్టమ్ ముందే గ్రహిస్తుంది. అది పంపే హెచ్చరికలను గుర్తిస్తే వీటి బారి నుంచి ముందే బయట పడొచ్చు. అలర్జీ వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ఉపయోగపడే పలు లక్షణాలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో అలర్జీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించుకొని డాక్టర్లను సంప్రదించొచ్చు.

ముక్కు కారడం: అలర్జీ రావడానికి కారణాలైన వాటిలో ముక్కు కారడం ప్రధానమైంది. సీజనల్ మార్పులు వచ్చినప్పుడు ముక్కు కారడం కామనే. ఎందుకంటే ఆ సమయంలో గాలిలో దుమ్ము, పుప్పొడి శాతం పెరగడమే. ముక్కు కారడం ఎక్కువైనప్పుడు, ముక్కు దిబ్బడ బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని రకాల వాసనలు కోల్పోతాం. డిటర్జెంట్, పెట్రోల్, స్పిరిట్ లాంటి వాసనలను పసిగట్టలేం. దీనర్థం ఈ వాసనలతో అలర్జీ ఏర్పడినట్లే అని అర్థం చేసుకోవాలి.

నిరంతరం తుమ్మడం:
శ్వాసకు సంబంధించిన అలర్జీ ఉన్న వారు నిరంతరం తుమ్ముతుంటారు. తుమ్ము అనేది శరీరం నుంచి అలర్జీలను బయటకు తీసేసే ఒక మార్గం.

గొంతులో దురద:
నాసికా రంధ్రం, గొంతు ఒకదాంతో ఒకటి అనుసంధానమై ఉంటాయి. అందుకే శ్వాసకు సంబంధించిన అలర్జీలు వచ్చినప్పుడు అది గొంతుపైనా ప్రభావం చూపుతంది. అలర్జీ ఉన్నప్పుడు తిన్నది మింగడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే గొంతులో మంటగా ఉంటుంది.

కళ్లలో నుంచి నీళ్లు కారడం:
శ్వాసకోశానికి సంబంధించిన అలర్జీలు ఉన్న వారికి కళ్లలో నుంచి నీళ్లు కారడం, కళ్లలో దురద పుట్టడం జరుగుతుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం వల్లే ఇది తీవ్రమవుతుంది.

Latest Updates