నేనిప్పుడు సెలబ్రిటీని.. నాపైనే చెయ్యేస్తావా

పాత రోజులను మర్చిపోయి..అభిమానంతో పలకరించిన ఓ మహిళ పట్ల పొగరుగా వ్యవహరించింది రేణూ మోండల్. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌లో కూర్చొని పాటలు పాడుకునే ఆమె.. బాలీవుడ్‌ గాయని అయ్యింది. ‘ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై’ అనే పాట పాడగా.. ఆమె పాటను వీడియో తీసి ఒకరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. దీంతో ఇప్పుడు  సెలబ్రిటీనని ఆమె ఫీల్ అవుతున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ లో రేణూ మోండల్ ప్రవర్తించిన తీరు  ఆశ్చర్యానికి గురి చేసింది.

ముంబైలోని ఓ షాపింగ్ మాల్ లో రేణూ మోండల్ ను చూసిన  ఓ మహిళ ఆమె దగ్గరకు వచ్చింది. సెల్ఫీ దిగాలని అనుకుంది. అభిమానంతో ఆమె భుజంపై చెయ్యి వేసి పిలిచింది. అయితే దీంతో రేణూ మోండల్ కు కోపం వచ్చేసింది. తన భుజంపై చెయ్యి ఎందుకు వేసావు ప్రశ్నించింది. అంతేకాదు ఇప్పుడు నేను సామాన్యురాలిని కాదు… సెలబ్రిటీనని… దూరంగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనికి సంబంధించిన వీడియో కాస్త బయటకు కావడంతో ..ఆమెపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక సారి ఆమె గతం గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. గొప్ప,గొప్ప గాయకులు కూడా ఈ విధంగా వ్యవహరించరని అంటున్నారు.

Latest Updates