వార్నింగ్ : ఈ తొమ్మిది రకాల శానిటైజర్లు ప్రాణాలు తీస్తాయ్ : ఎఫ్ డీఐ

శాని టైజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ దేశాలకు ఎఫ్ డీఐ హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి. శాని టైజర్ల తో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. అయితే చేతుల్ని శుభ్రం చేసుకునేందుకు వినియోగిస్తున్న శానిటైజర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది.    మెక్సికోలోని ఎస్కే బయో కెమ్ సంస్థ  మిథనాల్ ఆల్కహాల్ ,  మిథైల్ ఆల్కహాల్, కార్బినాల్ ఆల్కహాల్ ఉన్న శాని టైజర్లను మార్కెట్ లో విడుదల చేసింది. అయితే వాటిలో మిథనాల్ ఆల్కాహాల్ కంటెంట్ ఉన్న శానిటైజర్లను ఉపయోగించుకోవద్దని తెలిపింది. మిథనాల్ ఆల్కాహాల్ ఉన్న శానిటైజర్లను వినియోగిండచం వల్ల అనేక రకరకాలైన చర్మ సమస్యలు, కిడ్నీ, ఉదర భాగాల సమస్యలు , కోమా, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, నరాల బలహీనత, చూపు కోల్పోవడం పాటు మరణానికి దారితీస్తున్నట్లు గుర్తించామని ఎఫ్ డీఐ గుర్తించినట్లు తెలిపింది.  కాబట్టి  ఎస్కే బయోకెమ్ కు చెందిన తొమ్మిది ఆల్కాహాల్ ఉత్పత్తులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. శానిటైజర్ల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ డీఐ సూచించింది.

 ప్రాణాలు తీసే తొమ్మిది రకాల హ్యాండ్ శాని టైజర్లు ఇవే

ఆల్-క్లీన్ హ్యాండ్ శాని టైజర్ (ఎన్డీసీ – నేషనల్ డ్రగ్ కోడ్ ): 74589-002-01)

ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శాని టైజర్ (ఎన్డీసీ : 74589-007-01)

క్లీన్‌కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శాని టైజర్ 75% ఆల్కహాల్ (ఎన్ డీసీ: 74589-008-04)

లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్ (ఎన్ డీసీ : 74589-006-01)

గుడ్ జెల్ యాంటీ బాక్టీరియల్ జెల్ హ్యాండ్ శాని టైజర్ (ఎన్ డీసీ : 74589-010-10)

క్లీన్‌కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్ (ఎన్‌డీసీ): 74589-005-03)

క్లీన్‌కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 75% ఆల్కహాల్ (ఎన్‌డీసీ: 74589-009-01)

క్లీన్‌కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్ (ఎన్‌డీసీ: 74589-003-01)

సానిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ (ఎన్‌డీసీ: 74589-001-01)

Latest Updates