ఇట్లనే ఉంటే టైం వేస్ట్​: జీవితంలో ఎదగడానికి పాటించాల్సినవి…

don't waste your valuable time for others help, suggestions

‘ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆలోచించాలి తప్ప.. ఆలోచిస్తూ పనులు చేయడం వల్ల సమయం వృథా అవుతుంద’ని పెద్దలు చెబుతారు. అంతేకాదు ఆలోచన లేకుండా  చేయడం వల్ల కూడా సమయం వృథా అవుతుంది. అలాంటివే ఇవి..

 విషయాలు

మనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం వల్ల సమయం వృథా అవుతుంది. అంతేతప్ప.. మనకు జరిగే మేలు ఏమీ ఉండదు. కాబట్టి ఎదుటి వాళ్ల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

ఎదురు చూపులు

కొత్త కొత్త ఆలోచనల వల్ల పనిలో విజయాలు సాధించవచ్చు. కాబట్టి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి.. ఏదో సలహా ఇస్తారని ఎదురు చూడటం అనవసరం.

పనులు

అన్ని పనులు సొంతంగా చేసుకోవడం ఉత్తమం. సహాయం కోసం ఎదురుచూడటం వల్ల సమయం వృథా. పనిలో ఎదుటి వాళ్ల సలహాలు  తీసుకోవాలి తప్ప.. వాళ్ల సలహాలు, సూచనలతో పనులు పూర్తి చేయాలనుకోవడం తప్పు.

ఆలోచనలు

మన పని మనం చేస్తూ.. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. జీవితంలో మన పనులు మనమే చేసుకోవాలి. కాబట్టి ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించాల్సిన పని లేదు.

జీవితం

మన జీవితం మనకు నచ్చినట్టు ఉండాలి. కాబట్టి మనకొచ్చే ఆలోచనలకు అనుగుణంగా చేసే పనులు ఉండాలి. లేదంటే జీవితంలో విజయం సాధించడం కష్టం.

భయం

లేనిపోని భయాలు ఉంటే జీవితం ముందుకు సాగదు. కాబట్టి భయాన్ని వదిలి.. చేయాల్సిన పనులు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది.

స్పందన

చెడు జరిగినప్పుడు స్పందించాలి తప్ప.. ఎదుటివాళ్లకు ఫిర్యాదు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమీ ఉండదు. కాబట్టి మనం చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు.

ఒత్తిడి

మనం తీసుకునే నిర్ణయాలే ఫలితాలను నిర్ణయిస్తాయి. కాబట్టి మంచి ఆలోచనలతో ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాలి.  ఇలా చేయడం వల్ల ఒత్తిడి లేని జీవితం సొంతమవుతుంది.

మెప్పించడం

ప్రతి ఒక్కరినీ మెప్పించడం దాదాపుగా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఒక్కో మనిషికీ ఒక్కో మనస్తత్వం, ఒక్కో ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇతరులను ఎలా మెప్పించాలా? అని ఆలోచించడం అనవసరం.

పోలిక

ఇతరులతో పోల్చుకోవడం అనేది అనవసరమైన పనుల్లో ఒకటి. దీని వల్ల  జీవితంలో లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా పని చేసేటప్పుడు.. ‘ఇదే పని వాళ్లు ఎలా చేస్తారా?’ అని ఆలోచించకూడదు.

తప్పులు

చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేయడం అనేది ఒక అలవాటు. ఏదైనా పనిలో ఒకసారి తప్పు చేస్తే.. తోటి వాళ్లు అంగీకరిస్తారు. కానీ, అదే తప్పు మళ్లీ మళ్లీ చేయడం వల్ల ఎదుటివాళ్లకు మనపై నమ్మకం పోతుంది.

పర్​ఫెక్షన్​

చేసే పనిలో పర్​ఫెక్షన్​ ఉండాలి. లేదంటే సమయంతో పాటు చేసిన పని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైనా పని చేసే ముందు సరైన ప్రణాళికలు వేసుకోవాలి.

Latest Updates