తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు

ఉత్తరాఖండ్‌లోని నాలుగవ పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేదపండితుల ప్రత్యేక పూజల మధ్య ఇవాళ ఉదయం ప్రధాన ద్వారాలు తెరుచుకున్నాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు బద్రీనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా హిందూవులు ఈ పుణ్యక్షేత్రని దర్శించుకుంటారు. ఏటా ప్రతికూల పరిస్థితుల మధ్య శీతాకాలంలో బద్రీనాథ్‌ ఆలయాన్ని మూసివేస్తారు. ఆరు నెలల తర్వాత ఆలయ ప్రధాన ద్వారాలను తెరుస్తారు.

నిన్న(గురువారం) చార్ ధామ్ యాత్రలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయాన్ని  ఉదయం 5 గంటల 33 నిమిషాలకు తెరిచారు ఆలయాధికారులు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత… భక్తులను దర్శనానికి అనుమతించారు.

Latest Updates