దొరసాని ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు.. ఆనంద్ దేవరకొండ డెబ్యూ చేస్తున్న సినిమా దొరసాని. యాదార్థ సంఘటనల ఆధారంగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్ల లుక్‌తో పాటు టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు.

యాంగ్రీ మ్యాన్ గా పేరున్న సీనియర్ హీరో రాజశేఖర్ జీవిత దంపతుల రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ మూవీకి కెవిఆర్ మహేంద్ర దర్శకుడు.సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు మధుర ఎంటర్ టైన్మెంట్ బిగ్ బెన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న దొరసాని పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. రాజు పేద ఫార్ములాను ప్రేమకు అప్లై చేస్తూ గతంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం ప్రత్యేకతను కలిగిస్తోంది

శివాత్మిక చాలా ఇన్నోసెంట్ లుక్స్ తో క్యూట్ గా కనిపిస్తోంది. పాత్రకు తగ్గ వయసు పరిణితి ఎక్స్ ప్రెషన్స్ లో చూపిస్తూ మంచి ఫ్యూచర్ ఉందనే సంకేతాన్ని ఇవ్వకనే ఇస్తోంది. జీవిత పోలికలతో పాటు రాజశేఖర్ గ్రేస్ తనకు ఆకర్షణగా మారుతోంది.

ఇక ఆనంద్ దేవరకొండ అన్నయ్య విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్ కి స్టైల్ కి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. కారులో కూర్చున్న దొరసానిని ఓరకంట చూస్తున్న తీరు బాగుంది.

dorasani-first-look-release

Latest Updates