ఇండ్లు ఉన్న వాళ్లకేనా డబుల్ బెడ్రూమ్

డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ.. తెలంగాణ భవన్ లో ఆందోళన చేశారు ఖమ్మం నియోజకవర్గానికి చెందిన మహిళలు. ఇండ్లు ఉన్న వాళ్లే మళ్లీ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద లబ్ది పొందుతున్నారని.. పేదలమైన తమకు ఇవ్వడంలేదని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని అన్నారు.

సీఎం కేసీఆర్ ను కలిసి విన్నవిద్దామనే తెలంగాణ భవన్ కు వచ్చామన్నారు. ఖమ్మం జిల్లా మహిళలను అరెస్ట్ చేసి.. బంజారాహిల్స్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు.

Latest Updates