బ్యూటీ మయాంక్ : డబుల్ సెంచరీతో అదరగొట్టాడు

వైజాగ్: టీమిండియా యంగ్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్నఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. టెస్ట్ కెరీర్ లో ఫస్ట్ సెంచరీ చేసిన ఈ యంగ్ ప్లేయర్.. డబుల్ సెంచరీ చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి ఫస్ట్ వికెట్ కు 317 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించాడు. రోహిత్(176) ఔట్ అయినప్పటికీ ఆచితూచి ఆడుతూ డబుల్ సెంచరీ చేశాడు.

119వ ఓవర్ లోఎల్గర్ బౌలింగ్ లో 215 రన్స్ చేసి ఔట్ అయ్యాడు మయాంక్. ప్రస్తుతం 122 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 446 రన్స్ చేసింది టీమిండియా. జడేజా(7), హనుమ విహారి(3) క్రీజులో ఉన్నారు.