తగ్గిన బంగారం దిగుమతులు

రూ.69,171 కోట్లుగా ఇంపోర్ట్స్

వాణిజ్య లోటు దిగొచ్చింది

న్యూఢిల్లీ: ఏప్రిల్-అక్టోబర్ కాలంలో గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గాయి. కరోనా మహమ్మారి కారణంగా డిమాండ్ పడిపోవడంతో గోల్డ్ ఇంపోర్ట్స్ 47.42 శాతం తగ్గి రూ.69,171 కోట్లకు(9.28 బిలియన్ డాలర్లకు) పడిపోయినట్టు కామర్స్ మినిస్ట్రీ  డేటాలో వెల్లడైంది. గతేడాది ఇదే కాలంలో ఈ మెటల్ ఇంపోర్ట్స్  రూ.1,31,484 కోట్లుగా(17.64 బిలియన్ డాలర్లుగా) ఉన్నట్టు కామర్స్ మినిస్ట్రీ డేటా పేర్కొంది.  సిల్వర్ ఇంపోర్ట్స్ కూడా 64.65 శాతం తగ్గి 742 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తేలింది. గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్స్ తగ్గడంతో దేశీయ వాణిజ్య లోటు  దిగొచ్చింది. ఇంపోర్ట్స్‌‌కి, ఎక్స్‌‌పోర్ట్స్‌‌కి మధ్యనున్న తేడానే వాణిజ్య లోటుగా పరిగణిస్తారు. 2020–21 ఏప్రిల్– అక్టోబర్ కాలంలో వాణిజ్య లోటు32.16 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. అంతకుముందు ఏడాది ఈ లోటు 100.67 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియా ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ ఇంపోర్టర్. వాల్యుమ్ టర్మ్స్‌‌లో వార్షికంగా 800 నుంచి 900 టన్నుల వరకు గోల్డ్‌‌ను ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటోంది. జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్‌‌పోర్ట్స్ కూడా 2020 ఏప్రిల్–అక్టోబర్ నెలలో 49.5 శాతం తగ్గి 11.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

 

Latest Updates