జాగ్రత్తలు పాటిస్తే కొన్ని నెలల్లోనే కరోనా ఖతం

హైదరాబాద్, వెలుగుకరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ద ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నా, జాగ్రత్తలు పాటిస్తే కొన్ని నెలల్లోనే ఈ వైరస్ను అంతం చేయవచ్చన్నారు. ఆ దిశగా ప్రజలందరికి అవగాహన కల్పించాలని సూచించారు. ఐఐసీటీలో ఏడాదిగా జరుగుతున్న పరిశోధనలు, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వెబ్నార్ ద్వారా వివరించారు. ప్రతి వ్యక్తి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు వాడితే కరోనా వైరస్ను మరో ఆరు నెలల్లోనే మనదేశం నుంచి తరిమి కొట్టొచ్చన్నారు. మొదట్లో ఈ వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం వంటి సింప్టమ్స్ కనిపించేవని, ఇప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపించకుండానే వైరస్ వ్యాపిస్తోందన్నారు. యంగ్ పీపుల్ బయటకు వెళ్లడం వల్ల అక్కడ ఎవరి నుంచో అంటే వైరస్..  మన ఇంట్లో ఉండే వృద్దులకు, పిల్లలకు సోకే ప్రమాదం ఉందని చెప్పారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఐఐసీటీ సైంటిస్టులు ఇప్పటికే శానిటైజర్లు తయారు చేశారని, తమకు కాల్ చేస్తే వాటిని ఎలా తయారు చేయాలి, వాటికి కావాల్సిన కెమికల్స్ ఎక్కడ లభిస్తాయనే విషయాలను తెలియజేస్తారని చెప్పారు. ఐఐసీటీలో కరోనాపై జరుగుతున్న రీసెర్చ్ ల గురించి పలువురు సైంటిస్టులు వివరించారు.

Latest Updates