వైరల్ వ్యాధులతో 6 వేల మంది పిల్లలు బలి

తట్టు , పొంగు, చిన్నమ్మవారు, మశూచి, మీజిల్స్ లేదా రూబెల్లా.. బాల్యంలో దాదాపుగా ప్రతి ఒక్కరికీ వచ్చే ఈ వైరల్ వ్యాధి ఆఫ్రికా దేశం కాంగోలో వేలాది మందిని బలి తీసుకుంది. గత ఏడాది కాలంలో ఈ ఒక్క దేశంలోనే 3.10 లక్షల మీజిల్స్ కేసులు నమోదయ్యాయట. వీరిలో 6 వేల మంది పిల్లలు చనిపోయారట. కాంగోలో ఐదేళ్లలోపున్న1.80 కోట్ల మంది పిల్లలకు టీకాలు వేసినా, మశూచి ఇంత పెద్ద ఎత్తున విజృంభించడం పెను విషాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్ యూహెచ్ఓ) తెలిపింది. దీనిని ప్రపంచంలోనే ‘ఘోరమైన మశూచి విపత్తు’గా ప్రకటించింది. దీని నిర్మూలన కోసం అన్నిదేశాలు, సంస్థలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చింది.

Latest Updates