డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పై సైబర్ దాడి

హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పై సైబర్ దాడి జరిగింది. దీంతో ఐదు దేశాల్లో (అమెరికా, లండన్, బ్రెజిల్, రష్యా, ఇండియా) డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తన ఉత్పత్తులను నిలిపివేసింది. 24 గంటల తర్వాత ఉత్పత్తులను తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.గురువారం నాడు ఉదయం సైబర్ దాడి జరిగినట్టుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.సైబర్ దాడి జరిగిన తర్వాత అవసరమైన నివారణ చర్యలు తీసుకొనేందుకు వీలుగా డేటా సెంటర్ సేవలను వేరు చేసినట్టుగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రకటించింది. స్టాక్ ఎక్చేంజ్ కు ఇచ్చిన సమాచారంలో కంపెనీపై సైబర్ దాడి జరిగిన విషయాన్ని సంస్థ తెలిపింది. .డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధనలు చేస్తోంది. ఈ మేరకు డీసీజీఐ ఆమోదం తీసుకొన్న విషయం తెలిసిందే.

 

 

Latest Updates