డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ నుంచి డయాబెటిస్​ డ్రింక్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: మన దేశంలో సెల్విదా పేరిట డ్రింక్‌‌ను మార్కెట్లోకి తేవడం ద్వారా డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌ లిమిటెడ్‌‌ న్యూట్రిషన్‌‌ డ్రింక్స్‌‌ విభాగంలో ప్రవేశించింది. శరీరంలోని బ్లడ్‌‌ గ్లూకోజ్‌‌ స్థాయిని నియంత్రించుకోవడానికి పేషెంట్లకు ఇది సాయపడుతుందని కంపెనీ తెలిపింది. సెలిబ్రేషన్‌‌లో సెలి, విద అనే పదాల కలయికతో సెలిబ్రేట్‌‌ లైఫ్‌‌ అనే అర్ధం వచ్చేలా ఈ బ్రాండ్‌‌ పేరును నిర్ణయించినట్లు పేర్కొంది. కేసర్‌‌ ఇలాచి, చాక్లెట్‌‌ ఫ్లేవర్లలో దొరికే ఈ న్యూట్రిషన్‌‌ డ్రింక్‌‌ను 300 మంది డయాబెటిక్స్‌‌, ప్రిడయాబెటిక్స్‌‌పై టెస్ట్‌‌ చేసినట్లు డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ వెల్లడించింది. సెలివిదలో 28–30 శాతం ప్రొటీన్‌‌, 12–18 శాతం ఫైబర్‌‌, కార్బొహైడ్రేట్స్‌‌ ఉంటాయని తెలిపింది. సోయా, రాగి, గ్రామ్‌‌ వంటి మొక్కల ప్రొటీన్‌‌ను వినియోగిస్తున్నామని, ఇందులో 20 విటమిన్లు, మినరల్స్‌‌ ఉంటాయని పేర్కొంది. శారీరక అలసటను దూరం చేసేందుకు ఈ న్యూట్రిషన్‌‌ డ్రింక్‌‌ సాయపడుతుందని వివరించింది.

Latest Updates