డాక్టర్‌ రెడ్డీస్‌‌ లాభం 76 శాతం పెరిగింది

డాక్టర్‌‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌‌ నికర లాభం మార్చి 2020తో ముగిసిన క్వార్టర్లో 76 శాతం పెరిగింది. ఈ లాభం అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లోని రూ. 434 కోట్ల నుంచి తాజా క్వార్టర్లో రూ. 764 కోట్లకు పెరగడం విశేషం. కంపెనీ ఆదాయం కూడా కిందటి ఏడాది మార్చి క్వార్టర్‌‌తో పోలిస్తే 10 శాతం పెరిగి రూ.4,432 కోట్లకు చేరింది. 2019–20 ఫైనాన్షియల్‌ ఇయర్‌‌లో పనితీరు బాగుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ప్యాట్‌‌ మార్జిన్‌‌ గతంలోని 10.8 శాతం నుంచి 17.20 శాతానికి మెరుగుపడింది. నార్త్‌‌ అమెరికాకు రూ. 1,807 కోట్ల విలువైన జెనిరిక్స్‌ ను డాక్టర్ రెడ్డీస్‌ ఎగుమతి చేసింది. యూరప్‌‌కు రూ. 344 కోట్ల విలువైన జెనిరిక్స్‌ పంపగా, ఇండియాలో రూ. 690 కోట్ల మేర అమ్మకాలు సాగించినట్లు కంపెనీ తెలిపింది. ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ కు అమ్మకాలు రూ. 804 కోట్లు. మార్చి 2020 క్ వార్టర్లో రిసెర్చ్‌‌ అండ్ ‌ డెవలప్‌‌మెంట్‌‌పై ఆదాయంలో 9.5 శాతాన్ని కంపెనీ వెచ్చించింది.

2019–20 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌లో కంపెనీ పనితీరు బాగుంది. హైదరాబాద్‌ లోని ఒక యూనిట్‌‌కు యూఎస్‌ఎఫ్‌ డీఏ నుంచి ఎస్టా బ్లిష్‌ మెంట్‌‌ ఇన్‌ స్పెక్షన్‌ రిపోర్ట్‌‌ (ఈఐఆర్‌‌) వచ్చింది. అంటే, దీంతో ఆడిట్‌‌ పూర్తయినట్లే. ఇది కూడా ఒక మంచి పరిణామమే.

– జీ వీ ప్రసాద్‌‌, కో ఛైర్మన్‌ అండ్‌ ఎండీ డాక్టర్‌ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌న్యూఢిల్లీ

హైలెట్స్‌‌ 25 శాతం డివిడెండ్‌ ప్రకటన
నార్త్‌ అమెరికా సేల్స్‌ లో 21% గ్రోత్‌
యూరప్‌ సేల్స్‌ లో 80% గ్రోత్‌
ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ సేల్స్‌ లో 15% గ్రోత్‌
గ్లోబల్‌‌ జెనిరిక్స్‌ సేల్స్‌ లో 20% గ్రోత్‌

Latest Updates