ఆమె మృతి నన్ను కలచివేసింది

చెన్నై: ప్రముఖ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌‌లో పేరు గడించిన డాక్టర్ వి.శాంత మంగళవారం కన్నుమూశారు. 93 ఏళ్ల శాంతకు ఛాతీ నొప్పి రావడంతో మంగళవారం చెన్నైలోని ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె గుండెలో బ్లాక్ ఏర్పడిందని, దాన్ని తొలగించడం సాధ్యపడదని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఆమె ట్రీట్‌‌మెంట్ పొందుతూ మృతి చెందారు. క్యాన్సర్ కేర్ కోసం శాంత చాలా కృషి చేశారు. ముఖ్యంగా తమిళనాడులో అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌‌ను నెలకొల్పడంలో ఆమె తీవ్రంగా కష్టపడ్డారు. సదరు ఇన్‌‌స్టిట్యూట్‌‌లో పేషెంట్స్ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా హెల్త్ కేర్ అందిస్తున్నారు. ఈ ఇన్‌‌స్టిట్యూట్‌‌కు చైర్‌పర్సన్‌‌గా శాంత బాధ్యతలు నిర్వర్తించారు. శాంత మృతి పై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. టాప్ క్వాలిటీ క్యాన్సర్ ట్రీట్‌‌మెంట్‌‌ను అందించడంలో ఆమె విశేషమైన కృషి చేశారని మోడీ గుర్తు చేశారు. అణగారిన, పేద వర్గాలకు చెందిన క్యాన్సర్ పేషెంట్స్‌‌కు సేవలు అందించడంలో అడయార్ ఇన్‌‌స్టిట్యూట్ ముందుందని ప్రశంసించారు. శాంత మృతి తనను కలచివేసిందని ట్వీట్ చేశారు.

Latest Updates