కాన్‌ ప్లిక్ట్‌ కేసులో ద్రవిడ్‌ కు క్లీన్‌ చిట్‌

న్యూఢిల్లీ: కాన్‌ ప్లిక్ట్‌ కేసులో మాజీ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌ కు క్లీన్‌ చిట్‌ లభించింది. అతనిపై వచ్చిన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్‌ ఆఫీసర్‌ డీకే జైన్‌ కొట్టి పారేశారు. ద్రవిడ్‌ నిర్వహిస్తున్న బాధ్యతల్లో ఎలాంటి కాన్‌ ఫ్లిక్ట్‌ లేదన్నారు. సెప్టెంబర్‌ 26న ముంబైలో జరిగిన విచారణకు హాజరైన ద్రవిడ్‌ .. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించాడు. వాటిని పరిశీలించిన జైన్‌ .. మంగళవారం రెండోసారి విచారణ చేపట్టాడు. దీనికి హాజరైన ద్రవిడ్‌ తరఫు లాయర్‌ .. డాక్యుమెంట్లపై వివరణ ఇచ్చాడు. ఇండియా సిమెంట్స్‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌ పదవికి లీవ్‌ పెట్టానని చెప్పిన ద్రవిడ్‌ ..
చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. దీనిపై సంతృప్తి చెందిన జైన్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు.ఇండియా సిమెంట్స్‌ లో ఉద్యోగిగా పని చేస్తున్న ద్రవిడ్​.. ఎన్‌సీఏ చీఫ్‌ గా ఎలా ఉంటాడని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంపీసీఏ) మెంబర్‌ సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేసింది.

 

Latest Updates