ఇండియన్ క్రికెట్ ను దేవుడే కాపాడాలి: గంగూలీ

టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కు బీసీసీఐ అంబుడ్స్ మన్ నోటీసులివ్వడం పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ద్రావిడ్ కు నోటీసులా? భారత క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలంటూ గంగూలీ ట్వీట్ చేశాడు. భారత క్రికెట్లో చీటికిమాటికి నోటీసులివ్వడం కొత్త ఫ్యాషన్ గా  మారిందన్నాడు. వార్తల్లో నిలిచేందుకే ద్రావిడ్ కు నోటీసులిచ్చారని అన్నాడు. గంగూలీ ట్వీట్ కు హర్భజన్ సింగ్ మద్దతు తెలిపాడు. అవును భారత క్రికెట్లో ద్రావిడ్ ఒక లెజెండ్ అని అతడికి నోటీసులివ్వడమేంటని ప్రశ్నించాడు.  ఎన్సీఏ డైరెక్టర్ గా ఉంటూ అదే సమయంలో ఇండియా సిమెంట్స్ కు వైస్ ఛైర్మన్ గా ఉంటున్నాడని.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద ద్రావిడ్ కు నోటీసులిచ్చింది బీసీసీఐ.

Latest Updates