డీఆర్‌‌డీఓలో 224 పోస్టులు

డీఆర్‌‌డీఓకు చెందిన సెంట‌‌ర్ ఫ‌‌ర్ ప‌‌ర్సనల్ టాలెంట్ మేనేజ్‌‌మెంట్ (సెప్టమ్‌‌) 224 స్టెనోగ్రాఫ‌‌ర్‌‌ (ఇంగ్లిష్​ టైపింగ్​), అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్‌‌(హిందీ, ఇంగ్లిష్​ టైపింగ్​), సెక్యురిటీ అసిస్టెంట్, క్లర్క్, ​ఫైర్ ఇంజిన్ ఆపరేట‌‌ర్, ఫైర్‌‌మెన్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత‌‌: ప‌‌దోత‌‌ర‌‌గ‌‌తి, ఇంటర్​/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వ‌‌య‌‌సు: 18–27 ఏళ్ల మ‌‌ధ్య ఉండాలి.

సెలెక్షన్  ప్రాసెస్​: టైర్‌‌–1( కంప్యూట‌‌ర్ ఆధారిత రాతపరీక్ష),  టైర్‌‌–2( ట్రేడ్‌‌/ స్కిల్‌‌/ ఫిజిక‌‌ల్ ఫిట్‌‌నెస్ అండ్ కేపబిలిటీ టెస్ట్) ద్వారా.

పరీక్ష విధానం: రిటెన్​ టెస్ట్​ 150‌‌‌‌ మార్కులకు ఉంటుంది. ఆప్టిట్యూడ్​, రీజనింగ్, జనరల్​ అవేర్​నెస్​, జనరల్ ఇంగ్లిష్​ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం120 నిమిషాలు. టైర్​–2 పరీక్ష రాయాలంటే టైర్​–1లో జనరల్, ఓబీసీలు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100

ద‌‌ర‌‌ఖాస్తులు ప్రారంభం: సెప్టెంబ‌‌రు 21

చివరితేది: 2019 అక్టోబర్​ 15

వివరాలకు: www.drdo.gov.in

Latest Updates