డీఆర్‌డీవో నిర్వహించిన లేజర్ గైడెడ్ మిస్సైల్ ప‌రీక్ష విజయవంతం

లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను ఇవాళ(బుధవారం) DRDO  విజయవంతంగా పరీక్షించింది. MBT Arjun ట్యాంక్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. అహ్మద్‌నగర్‌లోని కేకే పర్వత శ్రేణుల్లో ఈ పరీక్ష చేపట్టారు. ATGM పరీక్ష ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు. బహుళ విధానాల్లో క్షిపణిని పరీక్షించేందుకు కావాల్సిన సాంకేతిక అంచనాలను పరీక్షిస్తున్నట్లు డీఆర్‌డీవో చెప్పింది. MBT Arjun ట్యాంకర్ నుంచి లేజర్ మిస్సైల్‌ను పరీక్షిస్తున్నట్లు చెప్పారు.

Latest Updates