సెజ్ లో 37 కిలోల బంగారం సీజ్

హైదరాబాద్​ శివార్లలోని రావిరాల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్​)లో 37.8 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ₹14.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారు ఆభరణాల తయారీ కోసం రావిరా ల సెజ్​లో ఏర్పాటు చేసిన కంపెనీలపై డీఆర్​ఐ అధికారులు కొన్నాళ్లుగా దృష్టి పెట్టారు. అక్కడ తయారు చేస్తున్న నగలను విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా స్థానిక మార్కెట్లకూ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తిగా సానబట్టని రాళ్లను వాడి బంగారం ఆభరణాలను తయారు చేస్తున్నట్టు తేల్చారు. అంతేగాకుండా ₹22.16 లక్షల విలువైన నగలకు ₹5.45 కోట్ల ధరను ఫిక్స్​ చేసినట్టు కనుగొన్నారు. 10 కిలోల ఫారన్​ మార్క్​ ఉన్న బంగారాన్ని స్థానిక మార్కెట్లకు తరలించారని తేలింది. బంజారాహిల్స్​లోని అదే కంపెనీకి చెందిన ఆఫీస్​లోనూ 21 కిలోల ఫారన్​ మార్క్​ గోల్డ్​, 6.8 కిలోల నగలు, 491 కిలోల రత్నాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్​ చేశారు.

 

Latest Updates