మిషన్ వాటరే తాగండి.. మినరల్ వద్దు

నల్గొండ జిల్లా: మిషన్ భగీరథ వాటర్ కు మించిన స్వచ్ఛమైన నీరు లేదని..ప్రజలంతా భగీరథ వాటర్ నే  తాగాలి…. మినరల్ వాటర్ బంద్ చేయండని తెలిపారు మంత్రి కేటీఆర్. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం దేవరకొండ మున్సిపాలిటీలోని 10వ వార్డులో రెండు గంటల పాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కమిటీ సభ్యులు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.  ఆ తర్వాత రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేవరకొండలో గతంలో ఉన్న తాగునీటి సమస్యను రూపుమాపి, ఇంటింటికి స్వచ్ఛమైన నది జలాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు.  విద్యుత్ సరఫరా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నదని.. చిన్న వ్యాపారాలు చేసుకునే వారు  ధీమాగా బతుకుతున్నారని చెప్పారు. దేవరకొండలో కోతుల బెడద, పందుల బెడద ఉందని తెలిసిందని.. తెలంగాణలో లoచగొండి తనాన్ని రూపుమాపి    ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రైవేట్ సెక్టార్ లో TS  ఐపాస్ ద్వారా పరిశ్రమలు స్థాపించి,  లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామని తెలిపారు. దేవరకొండ మున్సిపాలిటీలో ఇంటిటికి రెండు చెత్త బట్టలను అందిస్తామని తెలిపారు. దేవరకొండలో 6  ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డ్ ను నిర్మిస్తున్నామని..తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ప్రజలు   మున్సిపల్ ఆటోల్లో వేయాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా  ప్రతి మున్సిపాలిటీలో   10% బడ్జెట్ ను హరితహారం కోసం ఖర్చు చేసేలా   నిబంధనలు పొందుపర్చామని తెలిపారు. నాటిన మొక్కల్లో 85%  మొక్కలు బ్రతకాలి.. లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.

Latest Updates