కుండ నీళ్లే తాగాలి

చాలా మంది తరచుగా పార్టీలు ,ఫక్షన్లకు వెళ్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయిల్ ఫుడ్ , మసాల ఐటమ్స్​ తింటుం టారు. ఇతర సీజన్ తో పోలిస్తే, ఎండకాలంలో మాత్రం ఆయిల్ ఫుడ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లేదంటే డీహైడ్రేషన్‌ మొదలై వడదెబ్బకు గురయ్యే ప్రమాదాలు ఉంటాయి.పలుచని చారు, కారం లేని పులుసు, మజ్జిగచారు, పెరుగుతో చేసిన ఐటమ్స్​ తినాలి. దాహం లేకపోయినా, కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి. ఫ్రిజ్‌ నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది. మట్టి కుండలు ఉష్ణో గ్రతను బట్టి నీటిని చల్లగా ఉంచుతాయి. మట్టిలోని ఆల్కలైన్ అనేది.. నీటిలో ఆమ్లాలు చేరకుండా భద్రపరుస్తుంది. తద్వారా అసిడిటీ సమస్య దూరం అవుతుంది. కుండలో పోసిన నీటిని తాగడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. మట్టి కుండలో నీటిని పోయడం వల్ల ఆ కుండలో ఉండే ఔషధగుణాలు నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా మన శరీరా నికి కావాల్సిన ముఖ్యమైన మినరల్స్, ఎలక్ట్రో లైట్స్ నీటిలో కలుస్తాయి.కనుక ఆ నీటిని తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా , ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. అందుకే మట్టి కుండల్లో వండే ఆహారం తీసుకుంటే గ్యాస్ట్రిక్, సమస్యలు రావని వైద్యులు చెబుతున్నా రు. ఫ్రిజ్ నీళ్ల కంటే.. కుండ నీరు బెటర్ అని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి .

 

Latest Updates