బీర్ స్నానం గురించి ఎప్పుడైనా విన్నారా..?

ఓ చ‌ల్ల‌టి బీరు కొడితే ఎలా ఉంటుంది. మాంచి కిక్కు ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ కిక్కు ఉంటుంది. అలా అని కిక్కు కావాల‌ని పీపాలు పీపాలు తాగితే  లివ‌ర్ చెడిపోవ‌డం, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు సోకే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రష్ యూనివ‌ర్సిటీ మెడిక‌ల్, టఫ్ట్స్ యూనివ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

ఆరోగ్య‌క‌రంగా ఉండాలంటే స్త్రీ – పురుషులు రోజుకు  350 ఎంఎల్ మోతాదులో బీర్ తాగడం వ‌ల్ల  ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని తేల్చిచెప్పారు.

పైన చెప్పిన విధంగా బీర్ తాగ‌డం వ‌ల్ల ప్రోస్టేట్ క్యాన్స‌ర్ ను అరిక‌ట్ట‌డం, ఎముక‌ల పోష‌ణ, జ్ఞాప‌క‌శ‌క్తి సంబంధిత స‌మ‌స్య‌ల్ని అరిక‌ట్ట‌డం, కిడ్నీ రాళ్ల‌ను అడ్డుకోవ‌డంలో కీల‌క పాత్ర‌పోషిస్తుంద‌ని కొన్ని ప‌రిశోద‌న‌ల్లో తేలింది.

ఈ బీర్ తాగే అల‌వాటు ఉన్న‌వారు వృద్ధాప్య చాయ‌ల్ని మ‌టుమాయం చేసుకోవ‌చ్చ‌ట‌. అందుకే కాబోలు ప్రాచీన కాలంలో ఈజిప్టియ‌న్లు ఎక్కువ‌గా బీర్ తో స్నానం చేయ‌డం, బీర్ తాగ‌డం చేసేవారు. ఆ ట్రెండ్  ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో దేశాల్లో కొన‌సాగుతుంది.

సాధార‌ణంగా మ‌నం స్నానం నీటితో, ప‌సుపు నీటితోనే స్నానం చేస్తుంటాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం బీర్ ట‌బ్బుల్లో స్నానం చేస్తూ ఆనంద‌ప‌డిపోతున్నారు. ఓ వైపు బీర్ లో స్నానం చేస్తూనే బీర్ ను సేవిస్తుంటారు. ఈ వింత స్నానం ప‌ట్ల స్థానికులు, ప‌ర్యాట‌కులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

స్పెయిన్‌లోని గ్రనడాలో బీర్‌ స్పా ఉంది. ఆ ప్ర‌దేశం ప‌ర్యాట‌క ప్రాంతం కావ‌డంతో నిత్యం ప‌ర్యాట‌కులు ఆ బీరు స్పాలో సేద‌తీరుతుంటారు.  బీర్‌ స్నానం చేస్తూ బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. మ‌రికొంద‌రు బీర్ తో మ‌సాజ్ చేయించుకుంటారు. బీర్ స్నానం తర్వాత ఎండుగడ్డి పరుపుపై విశ్రాంతి తీసుకుంటారు. త‌గిన మోతాదులో బీర్ తాగ‌డం ఆరోగ్యానికి మంచిది. బీర్ తో స్నానం చేయ‌డం వ‌ల్ల నిత్యం య‌వ్వ‌నంగా క‌నిపిస్తామ‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Latest Updates