కారు లో వచ్చి శాంపిల్స్ ఇవ్వండి

గురుగావ్ : కరోనా టెస్ట్ లు స్పీడ్ గా ఈజీగా చేసేందుకు గురుగావ్ కొత్త కార్యక్రమం చేపట్టారు. డ్రైవ్ థ్రూ శాంపిల్స్ కలెక్షన్ పేరుతో కొన్ని హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేశారు. శాంపిల్స్ ఇచ్చే వారు కారులో లేదా ఇతర వెహికిల్ లో వచ్చి అందులోంచే శాంపిల్స్ ను ఇవ్వవచ్చు. రెండు నిమిషాల్లో ప్రాసెస్ పూర్తవుతుంది. దీని ద్వారా వేగంగా టెస్ట్ లు చేసేందుకు అవకాశం ఉంటుందని గురుగావ్ మున్సిపల్ కమిషనర్ వినయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం శాంపిల్స్ సేకరణకు హెల్త్ ఎంప్లాయిస్ ఇంటింటికి తిరగటం లేదా అనుమానిత లక్షణాలున్న వారు శాంపిల్స్ ఇచ్చేందుకు గంటల తరబడి హాస్పిటల్ దగ్గర క్యూ లో ఉండాల్సి వస్తోంది. డ్రైవ్ థ్రూ శాంపిల్స్ విధానం తో సేఫ్ గా సులభంగా శాంపిల్స్ సేకరించవచ్చని ఆయన చెప్పారు. హెల్తీషియన్ టెస్టింగ్ గ్రూప్ సహకారంతో ఈ క్యాంప్ లను ఏర్పాటు చేశారు. శాంపిల్స్ ఇచ్చే వారు ఆన్ లైన్ డిటేల్స్ ఫిల్ చేయాలి. అనుమానిత లక్షణాలున్న వారు కారులో వచ్చి హెల్త్ క్యాంప్ వద్ద శాంపిల్స్ ఇవ్వవచ్చు. నిమిషాల్లో ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. రిపోర్ట్స్ ను ఆన్ లైన్ పెడతాం. కచ్చితంగా డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉన్న వారికే కరోనా టెస్ట్ చేయించేస్తాం ” అని వినయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. త్వరలోనే మరిన్ని హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Latest Updates