నిద్రమత్తులో డ్రైవింగ్ ..ఔటర్ పై కారు ప్రమాదం

మేడ్చల్ జిల్లా : నిద్రమత్తుతో డ్రైవింగ్ చేయడంతో రెండు కార్లు ఢీకొన్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం బ్రిజా TS 16 EU 3636 కారును నడుపుతూ నల్గండ నుండి నిజామాబాద్ వెళ్తున్నాడు సైది రెడ్డి అనే వ్యక్తి. అయితే కీసర ఔటర్ దగ్గరకు రాగానే కారూలో ఉన్న సైది రెడ్డి నిద్ర పోవటంతో.. డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో ఎదురుగా వచ్చిన మరో కారు సైదిరెడ్డి కారును ఢీకొట్టింది. TS 08 FY 4356 నెంబర్ గల కారును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయప్డవారిని హాస్పిటల్ కి తరలించారు.

Latest Updates