విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ : భీమవరం యువకుల అరెస్ట్

చెన్నై విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్  పట్టుబడ్డాయి. నెథర్లాండ్ నుండి చెన్నై కి అక్రమంగా మేథో బెటమిన్ అనే మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు పార్సిల్‌ విభాగం లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి భీమవరం నుంచి చెన్నై ద్వారా నెథర్లాండ్ కి డ్రగ్స్ సరఫరా చేస్తునట్టు కష్టమ్స్ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఈ డ్రగ్స్ ను తరలిస్తున్న ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates