డ్రగ్స్ ఎప్పుడూ ఉపయోగించలేదు : రకుల్ ప్రీత్ సింగ్

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు ఇవాళ(శుక్రవారం) విచారించారు. దాదాపు నాలుగు గంటల సేపు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కీలక విషయాలను ఆమె తెలిపినట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తితో డ్రగ్ చాటింగ్ చేసినట్టు ఆమె ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే.. తాను డ్రగ్స్ ఎప్పుడూ వాడలేదని తెలిపింది. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో కూడా తనకు సంబంధం లేదని చెప్పింది రకుల్.

రకుల్ ప్రీత్ సింగ్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారని… ఆమె స్టేట్మెంట్ ను విశ్లేషించి, కోర్టుకు సమర్పిస్తామన్నారు NCB ముంబై శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్.

Latest Updates