లాక్డౌన్‌లో పనులు లేక.. చేసిన అప్పులు తీర్చలేక.. డోలు వాయిద్యుడు ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పులబాధ తట్టుకోలేక డోలు వాయిద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణంలోని బి.పి. అగ్రహారం ప్రాజెక్టు వీదికి చెందిన వెంకటరమణ (40) అనే వ్యక్తి ఉరేసుకొని మృతిచెందాడు. ఇతను శుభాకార్యాలకు డోలు వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా కారణంగా శుభకార్యాలేవీ జరగకపోవడంతో కొన్ని రోజులుగా ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దాంతో వెంకటరమణ అవసరాల నిమిత్తం కొంతమంది దగ్గర అప్పులు చేశాడు. అప్పిచ్చిన వారు 10 రోజుల్లో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దాంతో ఏం చేయాలో తెలియక వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత డాబా పైకి వెళ్ళి నిద్రపోయాడు. కుటుంబసభ్యులు ఉదయం లేచి చూసేసరికి వెంకటరమణ పంచెను మెడకు కట్టుకోని స్లాబ్ హుక్కుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తన బాధను పంచుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వెంకటరమణ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమణ మరణంతో పిల్లలు, భార్య కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ లేకుండానే  ప్రమోట్

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్

Latest Updates