డ్రంకెన్ డ్రైవ్: లైసెన్స్ రద్దు.. ఇదే మొదటి కేసు

మద్యం తాగి వెహికల్ నడుపుతూ (డ్రంక్ అండ్ డ్రైవ్ లో) 3సార్లు పోలీసులకు చిక్కిన వ్యక్తి మేడ్చల్ జడ్జి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్టు జీడిమెంట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. సూరారం గ్రామానికి చెందిన లాల్ మహ్మద్ గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండు సార్లు ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. ఇటీవలే మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మహ్మద్ ను జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు మేడ్చల్ స్పెషల్ క్లా స్ జడ్జి ముందు హాజరుపరిచారు. మహ్మద్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయడంతో పాటు అతడికి 20 రోజుల జైలు శిక్ష విధించా రు. జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడ్డ మొదటి కేసు ఇదేనని సీఐ చెప్ పారు.

Latest Updates