తాగిన మత్తులో డ్రైవింగ్.. అడ్డుకున్న పోలీసులపై దాడి

చెన్నై: మద్యం తాగి కారు నడుపుతూ.. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఓ డాక్టర్  హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో అంతకు ముందు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ ఆటోను డీకొట్టాడు. నిన్న రాత్రి చెన్నై లోని ఈ.సి.ఆర్ రోడ్డులోని నిలాంగరి ప్రాంతంలో  జరిగిందీ ఘటన. నగరానికి చెందిన నవీన్ అనే డాక్టర్ సోమవారం రాత్రి వేళ తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనను గమనించిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  తలకెక్కిన మత్తుతో ఆ డాక్టర్ పోలీసులను కొట్టడమే కాకుండా, రాయలేని బాషలో  తిడుతూ హల్ చల్ చేశారు. నీలగిరి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా డాక్టర్ నవీన్ తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పోలీసులు చెబుతున్నారు.

Latest Updates