ఫుల్లుగా మందుకొట్టి.. పోలీసుల మందు చచ్చిన శవంలా యాక్ట్ చేసిన మేయర్

బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉన్నాడు. కరోనా కారణంగా ప్రజలకు మంచి చెడ్డా చెప్పాల్సిన ఆయనే దారి తప్పాడు.  లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి స్నేహితులతో కలిసి పూటుగా మందు కొట్టాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు దొరికి పోతానేమోనన్న భయంతో చచ్చిన శవంలా యాక్ట్ చేశాడు. ఆయన యాక్టింగ్ స్థానికులు సైతం ముక్కున వేలేసుకున్నారు.

పెరూ దేశంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దక్షిణ పెరూలో టంటారా పట్టణ మేయర్ టోరెస్ . మేయర్ అంటే ఎంతో బాధ్యత మెలగాలి. కానీ బుద్ధి గడ్డి తిన్నది. ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన ఆయనే.. మేయర్ నన్న విషయం మరిచి పోయాడు.

స్వయంగా లాక్‌డౌన్ నిబంధలను తుంగలో తొక్కి స్నేహితులతో కలిసి బార్ లో  మద్యం తాగాడు. తిరిగి ఇంటికి వస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు రావడాన్ని మేయర్ టోరెస్ గమనించాడు. అసలే మేయర్. మందుకొట్టి ఉన్నాడు. పరువుపోతుందని భయపడ్డాడు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఓ శవ పేటికలో చచ్చిన శవంలా పడిపోయాడు.  పైగా ఓ మాస్కు కూడా ధరించి శవంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అసలే పోలీసులు.. వారి ముందు పప్పులు ఉడుకుతాయా..? అతడి నాటకాన్ని పసిగట్టి, సదరు నాటకాల మేయర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates