తప్పతాగి జనంపైకి కారెక్కించాడు

  • 11 మందికి గాయాలు..
  • దుబ్బాకలో దారుణం

దుబ్బాక, వెలుగు: తాగిన మత్తులో ఓ యువకుడు ఓవర్‌‌ స్పీడ్‌‌తో కారు డ్రైవ్‌‌ చేస్తూ వచ్చి రోడ్డు పక్కన ఉన్న వారి మీదికి ఎక్కించాడు. 11 మంది గాయపడిన ఈ ఘటన గురువారం సాయంత్రం దుబ్బాక పట్టణంలోని తెలంగాణ తల్లి జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల మేరకు పట్టణానికి చెందిన నవీన్‌‌ అనే యువకుడు మద్యం తాగి కారులో అంగడిబజార్ నుంచి స్పీడ్‌‌గా వెళ్తూ తెలంగాణ తల్లి జంక్షన్ వద్ద ఉన్న వారిని ఢీకొట్టాడు. ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. నలుగురు తీవ్రంగా గాయపడడంతో వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Latest Updates