హైదరాబాద్‌లో దారుణం.. మూడేళ్ల కూతురిని చంపిన తండ్రి

హైదరాబాద్ ఎల్బీనగర్లో లో దారుణం జరిగింది. మద్యం మత్తులో మూడేళ్ల కూతురిని గొంతు నులిమి హతమర్చాడు. బాలాజీ నగర్లోని ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న దుర్గయ్య అనే వ్యక్తి రోజు తాగి వస్తూ భార్యను పిల్లలను ఇబ్బంది పెట్టే వాడు. ఇవాళ ఉదయం కూడా తాగి వచ్చిన తండ్రి స్కూలుకు వెళ్తున్న యామినిని మద్యం మత్తులో గొంతునులిమి చంపేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుర్గయ్యను అరెస్ట్ చేశారు.  కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates