మద్యం మత్తులో శిశువుతో సంచరిస్తున్న మహిళ అరెస్ట్..

నాలుగు రోజుల వయసున్న పసిపాపతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో జరిగింది. తాగిన మైకంలో పసిపాపను తీసుకుని రోడ్డుపై తిరుగుతున్న ఓ మహిళను స్థానికులు గుర్తించారు. దీంతో ఆమెను పోలీసులకు అప్పగించగా.. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని శిశు సంక్షేమ కేంద్రానికి పంపించనున్నట్లు తెలిపారు.

Latest Updates