ఖాళీగా దుబాయ్‌ ఎయిర్‌ పోర్టు

ఎప్పుడూ వేలాదిమంది ప్రయాణికులతో కళకళలాడే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్​ శనివారం ఇట్లా ఒక్క మనిషి కూడా లేకుండా ఖాళీగా కనిపించింది. కరోనా వైరస్​ కారణంగా అనేక దేశాల నుంచి విమాన సర్వీసులు రద్దు కావడం, యునైటెడ్​ అరబ్ ఎమిరేట్స్​ లో కూడా 85 కరోనా కేసులు రిజిస్టరవడంతో దుబాయ్​ ఎయిర్​ పోర్టుకు రాకపోకలు బాగా తగ్గిపోయాయి. 7,200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుబాయ్​ ఎయిర్​ పోర్టు ప్రపంచంలోనే బిజీ  విమానాశ్రయాల్లో మూడోది. ‘డీఎక్స్​బీ’ అని  పిలిచే ఈ ఎయిర్​ పోర్ట్​ నుంచి వారానికి 7,700 విమాన సర్వీసులు నడుస్తుంటాయి. అరబ్ ప్రపంచంలో ఎక్కువ ప్రయాణాలు ఈ ఎయిర్​ పోర్టునుంచే జరుగుతాయి. ఎయిర్​ పోర్టు దాదాపుగా మూతపడినట్టే ఉండడంతో అక్కడ వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో బిజినెస్​ కూడా సాగడంలేదు.

Latest Updates