హైదరాబాద్ చిన్నారితో దుబాయ్‌ ప్రిన్స్‌

దుబాయ్‌ : కేన్సర్‌ తో బాధపడుతున్న హైదరాబాదీ చిన్నారి అబ్దుల్లా హుస్సేన్‌ (7ఏండ్లు) కోరిక నెరవేరింది. తనకెంతో ఇష్టమైన దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్దూమ్‌ ను అబ్దుల్లా శనివారం కలుసుకున్నాడు.ఆయనతో కాసేపు గడిపాడు. మాట్లా డాడు. ప్రిన్స్‌‌ గురించి, ఆయన పెంచుకుంటున్నజంతువుల గురించి తెలుసుకున్నాడు.బాలుడి ఫ్యామిలీతో కాసేపు సరదాగా గడిపిన ప్రిన్స్‌‌ హమ్దాన్‌ .. వాళ్లతో దిగిన ఫొటోను తనఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్టు చేశారు. ప్రిన్స్‌‌ను కలిసిన తర్వాత అబ్దుల్లా తల్లి నౌషీన్‌ ఫాతిమా మీడియాతో మాట్లాడారు. కీమోథెరపీ చికిత్సటైంలో తన కొడుకు బాధను తగ్గించేందుకు హమ్దాన్‌ గురించి, అవెంజర్స్‌‌ సూపర్‌ హీరోస్‌ గురించి చెప్పానన్నారు. ఆ తర్వాత హమ్దాన్‌ గురించి యూట్యూబ్‌ లో వీడియో చూసిన అబ్దుల్లా ఆయన ఫ్యానయ్యాడని చెప్పారు. ప్రిన్స్‌‌ పెంచుకునే జంతువులను వీడియోలో, ఫొటోల్లో చూసి సంబరుపడేవారన్నారు.

Latest Updates