ఇద్దరు పెళ్లాల ఇంటికెళ్లాలి.. పర్మిషన్ ఇవ్వండి

  • దుబాయ్ పోలీసులను కోరిన వ్యక్తి

కరోనా కల్లోలంతో ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే.. ఓ వ్యక్తి మాత్రం తన ఇద్దరు పెళ్లాల ఇండ్లకు వెళ్లేందుకు పర్మిషన్ కావాలంటూ దుబాయ్ పోలీసులకే రిక్వస్ట్ పెట్టుకున్నాడు. కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం దుబాయ్ పోలీసులు లాక్ డౌన్ నేపథ్యంలో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకునేందుకు రేడీయో ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా రేడియో స్టేషన్ కు కాల్ చేసిన ఓ వ్యక్తి.. ‘‘నేను ఇద్దరు మహిళలను పెండ్లి చేసుకున్నాను. ఒకరి ఇంటి నుంచి మరొకరి ఇంటికి వెళ్లేందుకు నాకు పర్మిషన్ ఇస్తారా’’ అంటూ పోలీసులను కోరాడు. దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ బ్రిగదీర్ సైఫ్ ముహైర్ అల్ మజ్ రౌ దీనికి స్పందిస్తూ.. ‘‘నీ భార్యతో ఉండాలని నీకు లేకుంటే.. లాక్ డౌన్ మంచి అవకాశం ఇచ్చింది’’ అంటూ సమాధానం ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు చాలా తనకు ఎదురయ్యాయని, అత్యవసర పరిస్థితుల్లో అది కూడా ఒక్కసారి మాత్రమే ఎవరికైనా పర్మిట్ ఇస్తున్నామని, ఇలాంటి సిల్లీ కారణాలను అసలు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. రోడ్ల మీదకు జనం ఎక్కువగా రాకుండా చూడాలని తాము భావిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసరాల కోసం వారం పాటు ఒకరికి పర్మిషన్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. మరికొందరు కరోనా వైరస్ ఎప్పుడు ముగుస్తుందని కొందరు.. పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఇంకొందరు కూడా కాల్స్ చేశారు. అత్యవసరంగా సూపర్ మార్కెట్ కు, ఫార్మసీకి వెళ్లాలనుకుంటే సైకిల్ నే వాడాలని, బైక్, కారును వాడొద్దని, అంతే గానీ ఊరికే చక్కర్లు కొట్టవద్దని సూచించారు.

Latest Updates