భర్త వదిలేసాడని అడుక్కుంటే.. పోలీసులు అరెస్ట్ చేశారు

భర్త వదిలేసాడని, పిల్లలు ఉన్నారని… బతకడానికి కష్టమవుతుందటూ ఆన్ లైన్ లో ఆర్థిక సహాయం కోరింది ఓ మహిళ. ఆమె పడుతున్న కష్టానికి ఆన్ లైన్ జనాలు కరిగిపోయారు. దీంతో ఆమెకు ఫండింగ్ ఇచ్చారు. ఇలా 17రోజుల్లోనే 50వేల డాలర్లు సంపాదించింది. ఈ ఘటన సౌదీలో జరిగింది. అయితే అసలు నిజం ఏంటంటే ఆమె తనకు  లేని కష్టాన్ని ఉన్నట్లు చెప్పి అందరిని మోసం చేసింది.

ఆ మహిళ ఆన్ లైన్ లో ఆర్థిక సహాయంకోరగా.. ఆమెను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. దుబాయ్ లో అడుక్కోవడం చట్టరిత్యా నేరం(ఆన్ లైన్ లో అయినా సరే). దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. దీంతో నిజాలు బయటపడ్డాయి. ఆమెను భర్త వదిలేసిన మాట వాస్తవమేనని అయితే పిల్లలు మాత్రం వాళ్ల తండ్రి దగ్గరే ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

ఆ మహిళ మాత్రం పిల్లలను పెంచేందుకు సహాయం చేయాలంటూ ఆన్ లైన్ లో కోరింది. దీంతో లక్షా 83వేల 500 దిరమ్స్‌ను ఆమెకు డోనెట్ చేశారు. ఈ విషయం పై పోలీసులు అక్కడి సిటిజన్స్ ను అలెర్ట్ చేశారు. దుబాయ్ లో అడుక్కోవడం నేరం అని తెలిపారు. సౌదీ చట్టాల ప్రకారం అక్కడ ఎవరైనా అడుక్కుంటే వారికి 50,000 నుంచి  2,50,000 దిరమ్స్‌ వరకు జరిమానా వేస్తామని చెప్పారు.

Latest Updates