భవిష్యత్ మ్యూజియం. వచ్చే ఏడాది ప్రారంభం

  • ప్రదర్శనకు కొత్త టెక్నాలజీలు
  • వాతావరణ మార్పు నుంచి మెడికల్ రంగ విప్లవాల వరకూ అన్నీ
  • వచ్చే ఏడాది దుబాయ్ లో లాంచ్

షేక్ జాయెద్ రోడ్.. దుబాయ్ లోని అతి పేద్ద హైవే.  దాన్ని ఆనుకుని ప్రతిష్టాత్మక ఎమిరేట్స్ టవర్స్. దీనికి చేరువలో ఉన్న కంటి లాంటి ఆకారం ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్! టెక్నికల్ దీని షేపును ‘టోరస్’ అని పిలుస్తారు. ఎమిరేట్స్ స్కై లైన్ గ్రాండ్ నెస్ ను మరింత పెంచేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో డిజైన్ చేసి, పైన అరబిక్ క్యాలిగ్రఫీని రాశారు. ఈ డిజైన్ ఇప్పటికే చాలా అవార్డులు గెల్చుకుంది. వచ్చే ఏడాది దీన్ని తెరుస్తారు.

అంతా ఫ్యూచర్ గురించే..

సాధారణంగా మ్యూజియమ్స్ లో పాత కాలానికి చెందిన వెలకట్ట లేని వస్తువులు ఉంటాయి. ఈ మ్యూజియం కాస్త డిఫరెంట్. భవిష్యత్ రాబోయే వింత టెక్నాలజీలు, మానవాళి ఎదుర్కొబోయే సవాళ్లను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. అంటే వాతావరణ మార్పుల నుంచి మెడికల్ రంగంలో రాబోయే విప్లవాల వరకూ అన్నీ ఇక్కడ చూడొచ్చన్నమాట.

తొలుత హెల్త్ కేర్, క్లైమేట్ ఛేంజ్, ఫుడ్ సెక్యూరిటీల్లో భవిష్యత్ లో రాబోతున్న టెక్నాలజీలను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. మెల్లిగా అన్ని రంగాల్లోని టెక్నాలజీలను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తారు. భవిష్యత్ లో భూమ్మీద కాకపోతే ఎక్కడ బతుకుతాం. వెల్ నెస్, ఎమోషనల్ హెల్త్ భవిష్యత్ లో ఎలా ఉంటుందనే విషయాలనూ చూపాలని అనుకుంటున్నట్లు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాత్ కార్ల్ సన్ తెలిపారు.

గ్రీన్ ఎనర్జీతో నడుస్తది..

మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సోలార్ ఎనర్జీతోనే నడుస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే బిల్డింగ్ ను ఎల్ఈఈడీ టెక్నాలజీతో సిద్ధం చేశారు. ఎలక్ట్రిక్ కార్లకు మ్యూజియం వద్ద చార్జ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మ్యూజియంలోని రెస్టారెంట్లలో పెట్టే ఫుడ్ కూడా ‘గ్రీన్’ ఇనిషియేటివ్ ను పాటిస్తుందని కార్ల్ సన్ వెల్లడించారు. 2020 దుబాయ్ ఎక్స్ పోలో మ్యూజియం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.

Latest Updates