బాడీగార్డ్ తో యువరాణి అక్రమ సంబంధం.. వెలుగులోకి రాకుండా..

ఆమె ఓ దేశానికి చెందిన రాజు భార్య. యూకేకి చెందిన తన బాడీగార్డ్ తో రెండేళ్ల పాటు అక్రమ సంబంధం కొనసాగించింది. ఆ సంబంధం బయటకు రావొద్దని ఉద్దేశంతో సుమారు రూ. 12కోట్లు కట్టబెట్టింది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోం 6వ భార్య ప్రిన్సెస్ హయా 36ఏళ్ల రస్సెల్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ రస్సెల్ భార్య లండన్ హైకోర్ట్ ను ఆశ్రయించింది. విచారణ సందర్భంగా తన భర్త రస్సెల్ తో దుబాయ్ ప్రిన్సెస్ అక్రమ సంబంధం కొనసాగిస్తుందని, ఆ సంబంధం బయటకు రాకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఖరీదైన గిప్ట్ లను ఇచ్చినట్లు తెలిపింది. హయా ఇచ్చే డబ్బుకు లొంగిపోయిన భర్త తనను పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోర్ట్ ను కోరింది.  ఈ సందర్భంగా లండన్ హైకోర్ట్ లో దుబాయ్ రాజు రషీద్, అతని భార్య ప్రిన్సెస్ హయాపై పిటిషన్ దాఖలైంది. కాగా భర్త నుంచి విడిపోయిన ప్రిన్సెస్ హయా తన పిల్లలతో వెస్ట్ లండన్ లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Updates