తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. వరద వస్తే ఏమైండు

dubbaka mla raghunandan rao ghmc election campaign speech at Nacharam

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నాచారం డివిజన్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
కేసీఆర్ బీజేపీ పై యుద్ధం ప్రకటిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అధికారమిచ్చిన ప్రజలకు సేవలందించకుండా.. ఎప్పుడూ ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ బీజేపీ పై యుద్ధం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిధులివ్వకుండా రాష్ట్రంలో జాతీయ రహదారులు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలన్నారు రఘునందన్. TRS పార్టీ లాగా బీజేపీ టిక్కెట్లు అమ్ముకోదన్నారు.

తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. హైదరాబాద్ లో వరద వచ్చి జనం అవస్థలు పడుతుంటే ఎక్కడున్నాడని ప్రశ్నించారు ఎమ్మెల్యే రఘునందన్. TRS – MIM రెండు వేరు కాదు, ఒక్కటే.. ఈ రెండింటిలో దేనికి ఓటు వేసినా ఒక్కటే. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని అన్నారు రఘునందన్ రావు.

Latest Updates