డుకాటీ డావెల్​@19.25 లక్షలు

లగ్జరీ మోటార్‌‌ సైకిల్‌‌ బ్రాండ్‌‌ డుకాటీ ‘డావెల్‌‌ 1260’, ‘డావెల్‌‌ 1260 ఎస్‌‌’ మోడల్స్‌‌ను ఇండియా మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. వీటి ఢిల్లీ ఎక్స్‌‌షోరూం ధరలు వరుసగా రూ.17.70 లక్షలు, రూ.19.25 లక్షలు. వీటిలో 1262 సీసీ టెస్టారెట్టా డీవీటీ ఇంజన్‌‌ ఉంటుంది. 129 ఎన్‌‌ఎం టార్క్‌‌ను విడుదల చేస్తాయి. ఢిల్లీ,ముంబై, పుణే, అహ్మదాబాద్‌‌, బెంగళూరు, కొచ్చి, కోల్‌‌కతా, చెన్నై, హైదరాబాద్‌‌ డీలర్ల దగ్గర బుకింగ్స్‌‌ మొదలయ్యాయని కంపెనీ ప్రకటించింది.

Latest Updates