డుకాటి కొత్త బైక్.. ధర రూ.11.99 లక్షలు

లగ్జరీ మోటర్‌‌‌‌సైకిల్ బ్రాండ్ డుకాటి బుధవారం తన సరికొత్త  హైపర్‌‌‌‌మోటర్డ్‌‌ 950 బైక్‌‌ను ఇండియన్ మార్కెట్‌‌లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ.11.99 లక్షలుగా(ఎక్స్‌‌షోరూం ప్యాన్‌‌ ఇండియా) పేర్కొంది. అన్ని డుకాటి డీలర్‌‌‌‌షిప్‌‌ల వద్ద ఈ బైక్‌‌ బుకింగ్స్‌‌ను కంపెనీ ప్రారంభించింది. 937సీసీ ట్విన్‌‌ సిలిండర్ డుకాటి టెస్టారెర్టా 11 డిగ్రీ ఇంజిన్‌‌తో దీన్ని రూపొందించింది. ఈ బైక్‌‌ అత్యధిక మైలేజీని ఇస్తుందని కంపెనీ చెప్పింది.

Latest Updates