టేప్ తో అంటించిన అరటికాయను 85లక్షలకు అమ్మిన కళాకారుడు

2016లో వంశీ పైడిపల్లీ డైరక్షన్ లో నాగార్జున, కార్తి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఊపిరి సినిమా గుర్తుందా..? ఆ సినిమాలో కార్తి, ప్రకాష్ రాజ్ మధ్య నడిచిన పెయింట్ సన్నివేశాలు కామెడీని పండించాయి.

కార్తి ఆ సినిమాలో రకరకలా కలర్స్ తో ఓ పెయింట్ వేసి ప్రకాష్ రాజ్ కు 10లక్షలకు అమ్ముకుంటాడు. ఇలా సినిమాలోనే కాదండోయ్ నిజజీవితం లో జరుగుతున్నాయి. సినిమాలో  పెయింట్ ఖరీదు 10లక్షలే. కాని నిజ జీవితంలో అది ఎంత అమ్ముడుపోయిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సింది. కానీ ఇది పెయింట్ కాదు లేండి. గోడకు ప్లాస్టర్ తో అంటించిన ఓ అరటి కాయ.

ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాట్ లాన్ అమెరికాలోని మియామీ అనే ప్రాంతంలో రూ.29తో ఓ అరటిపండును కొనుగోలు చేశాడు. అనంతరం తాను కొన్న అరటికాయను క్రియేటివిటీగా ఏదో చేయాలి అని ఆలోచిస్తుండగా..ఓ మెరుపులాంటి ఐడియా కాట్ లాన్ కు తట్టింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా మియామీ బీచ్ లో ఓ టేపు సాయంతో గోడకు ఆ అరటిపండును అంటించాడు. దాని కింద కొన్ని పుస్తకాలు అమర్చాడు. అనంతరం ఆ అరటికాయను “కమెడియన్” అనే పేరుతో ప్రదర్శనకు ఉంచారు. అలా అంటించిన అరటి పండు ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..? అక్షరాల 85లక్షలు.

అంతేకాదు కాట్ లాన్ ఇప్పటి వరకు ఈ తరహా మూడు  కళా ఖండాల్ని  తయారు చేశాడు. ఓ రెండు కళాఖండాలు ఇప్పటికే ప్రెంచ్ కలెక్టర్స్ సొంతం చేసుకున్నారు.

మూడో కళాఖండం కోటి రూపాయలకు అమ్మేందుకు ఇటాలియన్ కళాకారుడు ప్రయత్నిస్తుండగా రూ.85లక్షలకు కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ముందుకొచ్చారు.

కోటిరూపాయలకు అమ్ముడుపోతే మ్యూజియంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడట కాట్ లాన్.

ఇక అరటికాయ రూ85లక్షలు అమ్ముడుపోవడంతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒక్క అరటికాయ 85 లక్షలైతే  నేను 20 అరటికాయల్ని అలాగే గోడకు అంటిస్తా మీరెంతకు కొంటారని కామెంట్ చేస్తున్నాడు.

అరటికాయ కుళ్లిపోతే ఏం చేయాలని ఓ నెటిజన్ ప్రశ్నిస్తుంటే..కుళ్లితరువాత కొనుగోలు చేస్తే బాగుండేదని మరో నెటిజన్ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ అరటికాయ 85లక్షలకు అమ్ముడుపోవడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

 

 

Latest Updates