మార్కెట్లోకి డుమాంట్‌‌ ప్రీమియం ఐస్‌‌క్రీమ్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : డుమాంట్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ ప్రీమియం ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ 34 ఫ్లేవర్స్‌‌‌‌తో  హైదరాబాద్‌‌‌‌ మార్కెట్లో అడుగుపెట్టింది. నగరంలో తొలి దశలో 4 అవుట్‌‌‌‌లెట్లను నెలకొల్పనుంది. రాబోయే కొన్ని నెలల్లోనే ఈ సంఖ్యను 8 కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 15 కోట్లతో విజయవాడ సమీపంలో తయారీ యూనిట్‌‌‌‌ నెలకొల్పామని, అంతే పెట్టుబడితో హైదరాబాద్‌‌‌‌లో కొత్త యూనిట్‌‌‌‌ను రాబోయే ఏడాది కాలంలో ఏర్పాటు చేయనున్నామని డుమాంట్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ను తెస్తున్న వింట్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ బెవరేజెస్‌‌‌‌ మేనేజింగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ వివేక్‌‌‌‌ అయినంపూడి వెల్లడించారు. ఇండియా మార్కెట్లో లేని వినూత్న ఫ్లేవర్స్‌‌‌‌ను కస్టమర్లకు అందించాలనే టార్గెట్‌‌‌‌తోనే ప్రీమియం ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. డెయిరీ, ఫ్రోజెన్‌‌‌‌ డిజర్ట్స్‌‌‌‌ తయారీలో తమకు 20 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర మార్కెట్లోనూ కలిపి రాబోయే ఏడాది కాలంలో 100 డుమాంట్‌‌‌‌ స్టోర్స్‌‌‌‌ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సొంత ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ డీతో బ్లూబెరీ చీజ్‌‌‌‌కేక్‌‌‌‌, కారామిలైజ్డ్‌‌‌‌ పైనాపిల్‌‌‌‌, చాకో ఆరంజ్‌‌‌‌, ఖీర్‌‌‌‌, థాయ్‌‌‌‌ టీ వంటి వినూత్న ఫ్లేవర్స్‌‌‌‌ను రూపొందించామని వివేక్‌‌‌‌ చెప్పారు. ఫ్లేవర్డ్‌‌‌‌ మిల్క్‌‌‌‌ కూడా 34 ఫ్లేవర్స్‌‌‌‌లోనూ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దేశంలో ఫ్లేవర్డ్‌‌‌‌ మిల్క్‌‌‌‌, ప్రీమియం ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ విలువ రూ. 6 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ పరిశ్రమ ఏటా 30 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ మార్కెట్లో పెద్ద ప్లేయర్‌‌‌‌గా అవతరించాలనేదే తమ ధ్యేయమని, మెట్రోలతోపాటు, ముఖ్యంగా టైర్‌‌‌‌ 2, టైర్‌‌‌‌ 3 పట్టణాల వైపు దృష్టి పెడతామని వెల్లడించారు.

Latest Updates