రాను మండల్ కి డూప్లికేట్

రైల్వే ప్లాట్ ఫాం స్టేజ్ నుంచి బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడే స్థాయికి చేరుకున్నారు రాను మండల్. పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్ రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకునే మండల్ …లతా మంగేష్కర్ ఐకానిక్ సాంగ్ ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ను పాడిన వీడియో వైరల్ కావడంతో రేణు మోండల్ ఓవర్ నైట్‌లో స్టార్ సింగర్‌గా వెలిగిపోయారు.

రాను మండల్ పాడిన అనేక పాటలు..సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆమెకు ఫాలోవర్స్ కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. అయితే లేటెస్ట్ గా రాను మండల్ లానే ఉన్న మరో మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గౌహతికి చెందిన ఈ మహిళ కూడా…రాను మండల్ పాడిన తేరి మేరీ కహానీ పాటనే పాడింది. ఆ పాటకు సంబంధించిన వీడియోను రాను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఆ మహిళను రాను మండల్ 2.0 గా పిలుస్తున్నారు.

Latest Updates