దుర్గా పూజతో మెసేజ్ : ప్లాస్టిక్ వద్దంటూ మండపం కట్టారు

దసరా నవరాత్రులను దేశం మొత్తం ఎంతో వైభవంగా జరుపుకుంటుంది. ఈ పండుగ వెలుగులలో ప్రకృతిని కాపాడాలంటూ దేశప్రజలకు మెసేజ్ ఇచ్చారు కోల్ కతా వాసులు. కోల్ కతాలోని సంతోష్ పూర్ లేక్ పల్లిలో దుర్గాదేవి మండపాన్ని ప్లాస్టిక్ కవర్లతో ఏర్పాటు చేశారు. ఈ మండపంలో ప్లాస్టిక్ బాటిళ్లను, ప్రకృతికి హాని చేసే దోమల కాయిల్స్ ను, టపాకులను, ఎయిర్ కండీషనర్ లను, లౌడ్ స్పీకర్ లను వాడొద్దని చెప్పారు.  ఇవి మానవాళితో  పాటు జంతు జాలానికి హాని తలపెడతాయని అన్నారు. ప్రకృతికి దగ్గరగా ప్రతీ పండుగను జరుపుకోవాలని అదే మన సంసృతి అని చాటి చెప్పారు. ఈ విషయం పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates