పైసలు ఏడికి పోతున్నయ్ !

During Elections, This Band is Asking ‘Where the Money Flows’

న్యూఢిల్లీ: ఒక దూలం. కోతి మాస్క్​ పెట్టుకున్న ఒక మనిషి. ఆ దూలానికి అతడిని కట్టేశారు. చేతిలో మైక్​ పట్టుకుని ఆ వ్యక్తి ఓ ఇంగ్లిష్​ పాటందుకున్నాడు. ‘ఓ వేర్​ ద మనీ ఫ్లోస్​ (డబ్బు ఎటు పోతోంది)? ఓ వేర్​ ద మనీ గోస్​’ అంటూ రాగం తీశాడు. 2016 నవంబర్​ 8 గుర్తుండే ఉంటుంది. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ అనౌన్స్​మెంటే బ్యాగ్రౌండ్​లో వస్తుంది. ఆ కోతి మాస్క్​ పెట్టుకున్న వ్యక్తి కుప్పలుతెప్పలుగా పడి ఉన్న వెయ్యి, 500 నోట్లకు నిప్పు పెట్టి బూడిద చేసేస్తాడు. ప్రధాని మోడీ నోట్లను రద్దు చేస్తూ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీకి చెందిన పీటర్​ క్యాట్​ రికార్డింగ్​ కంపెనీ (పీసీఆర్​సీ) చేసిన ఆల్బమ్​ ఇది. చివరి దశ ఎన్నికల ముందు ఈ వీడియో విడుదల చేసింది. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో ఆ వీడియో షేర్​ చేసి ‘ఆమ్​ ఆద్మీ పార్టీ’కి ఓటేయండి అన్న ట్యాగ్​ పెట్టారు.

రాజకీయ సందేశం కాదు: ఈ పాటలో రాజకీయ సందేశమేమీ లేదని బ్యాండ్​ ప్రధాన సింగర్​ సూర్యకాంత్​ సాహ్ని అలియాస్​ లిఫాఫా చెప్పాడు. దీన్ని నోట్ల రద్దుకు ముందే రాశానన్నాడు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఒక్క రాత్రితో చిత్తు కాగితమైపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చూపించేందుకు ప్రతీకగా కోతి మాస్క్​ను ఎంచుకున్నామన్నాడు.

Latest Updates