ఈ-కామర్స్ అడ్డాగా నలుగురి ట్రాప్

హైదరాబాద్,వెలుగు:  ఈ–కామర్స్ అడ్డాగా శుక్రవారం ఒక్కరోజే నలుగురిని ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్స్ రూ.3లక్షల12 వేలు కాజేశారు. చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ క్యాంపస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శ్యాంకుమార్ సెకండ్​లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్​కొనేందుకు ఫేస్ బుక్ లో సెర్చ్ చేశాడు. కేరళ రిజిస్ట్రేషన్‌‌‌‌తో కనిపించిన యాడ్ చూసి, అందులోని నంబర్‌‌‌‌‌‌‌‌కి కాల్‌‌‌‌ చేశాడు. రూ.65 వేలకు బేరం మాట్లాడుకోగా, ట్రాప్‌‌‌‌ చేసిన సైబర్‌‌‌‌‌‌‌‌ క్రిమినల్ వివిధ చార్జీల పేరుతో రూ.80,400 వసూలు చేశాడు. బైక్ డెలివరీ కాకపోవడంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  ఓఎల్ఎక్స్ అడ్డాగా యూసుఫ్‌‌‌‌గూడకి చెందిన జగదీశ్‌‌‌‌ రెడ్డి  నుంచి రూ.94,200, రవి నుంచి రూ.66,540,  అబ్దుల్‌‌‌‌ మాలిక్‌‌‌‌ వద్ద రూ.71 వేలను సైబర్ క్రిమినల్స్ కొట్టేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

Latest Updates